Naga Chaitanya, Sobhita: సమంత గురించే నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌పై జాతకం చెప్పాను.. మరోసారి సంచలనంగా వేణుస్వామి కామెంట్స్ (వీడియో)

నాగచైతన్య, శోభిత ధూళిపాళ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-12 10:05 GMT
Naga Chaitanya, Sobhita: సమంత గురించే నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌పై జాతకం చెప్పాను.. మరోసారి సంచలనంగా వేణుస్వామి కామెంట్స్ (వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: నాగచైతన్య, శోభిత ధూళిపాళ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. చైతన్య, శోభిత వివాహ బంధంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు వేణుస్వామి. 2027 నుంచి వీరి వైవాహిక జీవితంలో అనేక మార్పులు వస్తాయని, ఒక స్త్రీ కారణంగా వీరిద్దరూ విడిపోయే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అలాగే.. సమంత-చైతన్య జంట వైవాహిక జీవితానికి 100కి 50 మార్కులు ఇవ్వొచ్చు. కానీ చైతన్య-శోభిత జంటకి వైవాహిక జీవితానికి 100కి 10 మార్కులు కూడా ఇవ్వలేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో నెట్టింట పెద్ద సంచలనమే సృష్టించింది. దీంతో వేణుస్వామి వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. శుభమా అని ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే అపశకునంగా మాట్లాడుతున్నావు అంటూ ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి స్పందించాడు వేణుస్వామి.

ఆయన మాట్లాడుతూ.. ‘ఒక మూడు రోజుల క్రితం.. శోభిత, నాగచైతన్యల జాతకం విశ్లేషించడం జరిగింది. దాని మీద తీవ్రమైనటువంటి ట్రోల్స్, డిబెట్స్ జరుగుతున్నాయి. నేను వాళ్ల జాతకం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే..? ఇంతకు ముందు సమంత, నాగచైతన్య జాతకం చెప్పి ఉన్నాను కాబట్టి.. ఇప్పుడు ఇది కూడా చెప్పాను. సెలబ్రెటీల జాతకాలు కానీ, రాజకీయాలపై కానీ ఇకపై జాతకం చెప్పను అని రెండు నెలల కిందనే ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను. అయితే.. నాగచైతన్య, శోభిత జాతకం ఎందుకు చెప్పాను అంటే.. ఇంతకు ముందు సమంత, నాగచైతన్య జాతకాలు చెప్పాను కాబట్టి.. దాని కంటిన్యూషన్‌గా ఇప్పుడు ఇది చెప్పాను. ఇక ఇప్పుడే నాతో ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడారు. వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నేను సెలబ్రెటీల జాతకాలు కానీ, రాజకీయ జ్యోతిష్యం కానీ, ఎవరికైనా సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కానీ ఇకమీదట చెప్పడం జరగదు. ప్రత్యేకించి నాగచైతన్యది చెప్పడానికి కారణం.. సమంతది జరిగింది కాబట్టి చెప్పాను. ఇకపై ఇలాంటివి నేను చెప్పను’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చాడు వేణు స్వామి.

Tags:    

Similar News