Venu Swamy: ‘ఆ ఒక్క రీజన్‌తోనే సమంతను సైడ్ చేశారు’ తొందర్లో మరో పెళ్లి.. వేణు స్వామి సంచలన కామెంట్స్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు.
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. నటీనటుల పెళ్లి విషయంలో వారి జాతకాలను చూసి వీరికి పెళ్లి అచ్చు రాదు.. విడాకులు తీసుకుంటారు అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా చెప్పిన వాటిల్లో ముఖ్యంగా సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని బిగ్‌బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. అలా ఈయన చెప్పిన తర్వాత వీరు నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి జాతకాలు నిజమవుతాయని సెలబ్రిటీలు సైతం అతని వద్దకు వచ్చి జాతకాలను చెప్పించుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా నాగ చైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నెక్స్ట్ డేనే వీరి వైవాహిక జీవితం పై సంచలన కామెంట్స్ చేశాడు. అందులో భాగంగా సమంత-నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య-శోభితల జాతకం కలవలేదని, వీరిద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. కాగా తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఆయన జ్యోతిష్యంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. వేణు స్వామి మరోసారి సమంత పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2013 లో తాను చెప్పిన విధంగానే సమంతా, చైతు విడిపోయారని.. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఎవరు కూడా అండగా నిలవలేదు అని అన్నారు. దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి పోయి.. మయోసైటిస్‌కు గురైయి.. ఎంతో ధైర్యంతో కోలుకుని, ప్రస్తుతం ఆమె మరల హిట్ సినిమాలు చేస్తుందన్నారు.
అలాగే కన్నడ,తమిళ ఇండస్ట్రీలు ఆదరించిన విధంగా.. తెలుగు ఇండస్ట్రీ సమంతాను ఆదరించట్లేదని వేణు స్వామి అన్నారు. ఆమె ఇక్కడి అమ్మాయి కాక పోవడం వల్లే... ఇలా చేస్తున్నారని వేణు స్వామి ఆరోపించారు. అయితే కొందరు కావాలనే సమంతా వ్యవహారం సైడ్ ట్రాక్‌కు వెళ్లేలా చేసి.. తనపై లేని పోనీ విధంగా ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అయిన కూడా తాను గతంలో ఒక అమ్మాయికి జాతకం చెప్పాను.. ఇప్పుడు కూడా మరో అమ్మాయి జీవితం ఇబ్బందులు పాలు కావొద్దని జాతకం చెప్పానని వేణు స్వామి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. సమంత అతి తొందరలో మరో పెళ్లి చేసుకొని, పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు వేణు స్వామి స్పష్టం చేశారు.