రానాతో చేయడం బిగ్ ఛాలెంజ్ అంటున్న వెంకీ
‘రానా నాయుడు’ సిరీస్ ఎగ్జయిటింగ్ జర్నీ అని చెప్పుకొచ్చాడు విక్టరీ వెంకటేష్.
దిశ, సినిమా : ‘రానా నాయుడు’ సిరీస్ ఎగ్జయిటింగ్ జర్నీ అని చెప్పుకొచ్చాడు విక్టరీ వెంకటేష్. తొలిసారి కొడుకు రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌లో.. నాగా నాయుడు పాత్ర చేయడం నటుడిగా బిగ్ ఛాలెంజ్ అని తెలిపాడు. సిరీస్‌లో పనిచేయడానికి, సినిమాల్లో వర్క్ చేయడానికి చాలా తేడా ఉందన్న వెంకీ మామ.. కథ చెప్పే వేగం శైలికి అలవాటుపడటానికి కొంత సమయం తీసుకుందని చెప్పాడు.
నెగిటివ్ పాత్రను పోషించడం తన వరకు రిఫ్రెష్ చేంజ్ అని, తద్వారా మూవీ క్రాఫ్ట్ కొత్త కోణాలను అన్వేషించడానికి దోహదపడిందన్నాడు. ఇక రియల్ లైఫ్‌లో అబ్బాయి బాబాయిగా కాకుండా ఫ్రెండ్స్‌గా ఉండే రానాకు తనకు మధ్య.. స్క్రీన్‌పై వార్ ఈక్వేషన్ తీసుకురావడం కష్టమే అయినా నటుడిగా ఇది సంతోషకరమైన భాగమని తెలిపాడు. ఇది ఖచ్చితంగా తమ ఇద్దరికీ కొత్త ప్రయత్నమని, పాత్రలకు జీవం పోసేందుకు ఒకరికొకరు సూచనలు తీసుకున్నామని వివరించాడు వెంకీ మామ.