గూగుల్‌ను రిపేర్ చేయాలన్నా గురువే కావాలి: వెంకయ్య నాయుడు
సంజయ్ కిషోర్ రచించిన ‘స్వాతంత్రోద్యమం-తెలుగు సినిమా-ప్రముఖులు’ అనే పుస్తకావిష్కరణోత్సవం ఘనంగా జరిగింది
దిశ, సినిమా : సంజయ్ కిషోర్ రచించిన ‘స్వాతంత్రోద్యమం-తెలుగు సినిమా-ప్రముఖులు’ అనే పుస్తకావిష్కరణోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు బుక్‌ను విడుదల చేసిన భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ‘తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుంచి ఉన్నది. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితుల గురించి సంజయ్ చక్కటి విశ్లేషణ చేశాడు. ఇలాంటి పుస్తకాలు సమాజానికి చాలా అవసరం. గూగుల్‌ను రిపేర్ చేయాలన్నా గురువే కావాలి అంటూ గురువు గొప్పతనాన్ని చెప్పాడు. ఈ పుస్తకాన్ని వీడియో రూపంలో తీసుకురావాలని సంజయ్‌ను కోరుతున్నా’ అన్నారు. ఇక కె.వి రమణాచారి ప్రోత్సాహంతో ఈ పుస్తక ప్రయాణం మొదలు పెట్టానన్న సంజయ్ ఆర్ధిక సాయం చేసిన కిమ్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్య, సదరన్ ఇంజనీరింగ్ కంపెనీ అధినేత రాజశేఖర్, ఆవిష్కరించిన వెంకయ్యగార్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వేడుకలో పొల్గొన్న మండలి బుద్ధ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, కె.వి.రమణాచారి రచయితను అభినందించారు.