54 సెంటర్లు 50 రోజులు.. దూసుకుపోతున్న ‘వీర సింహారెడ్డి’

నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’.

Update: 2023-03-02 13:02 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. శృతిహాసన్ కథానాయికగా నటించగా, హనీ రోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మధ్య కాలంలో పెద్ద స్టార్ మూవీ అయినా సరే రెండు వారాలకు మించి ఆడట్లేదు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య మూవీ ఇప్పటి వరకు 54 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుని, ఆయన కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి : చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన రామ్‌గోపాల్ వర్మ

Tags:    

Similar News