వరుణ్ తేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మట్కా’.. ఒక్క ఫేజ్‌కే 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ డా. విజయేందర్ రెడ్డి తీగల, SRT ఎంటర్టైంన్మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు.
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ డా. విజయేందర్ రెడ్డి తీగల, SRT ఎంటర్టైంన్మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జేట్‌తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోతా ఫతేహి కథానాయికులుగా నటిస్తుండగా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ అనే విషయాన్ని మేకర్స్ ముందుగానే తెలియజేశారు. ఈ ఒక్క ఫేజ్‌కే సుమారు రూ. 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించినట్లుగా సమాచారం. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్‌ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించే లక్ష్యంతో చిత్ర టీం వర్క్ చేస్తోంది.
కాగా వింటేజ్ సెట్లలో ఇన్వెస్ట్మెంట్ విజువల్ వండర్‌ని తలపించేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజాగ్‌లోని ఎసెన్స్‌ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సెట్‌లు సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. మేకింగ్ వీడియో ఇంటెన్సీవ్ ప్రీ-ప్రొడక్షన్, గ్రాండ్-స్కేల్ మేకింగ్‌ను తెలియజేస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ గ్లింప్స్ కూడా చూపించారు. వెర్సటైల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ ‘మట్కా’లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.