అప్ కమింగ్ మూవీ షూటింగ్‌కు వరుణ్ తేజ్.. RFCలో ‘మ‌ట్కా’ షెడ్యూల్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ పాన్- ఇండియన్ మూవీ ‘మట్కా’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

Update: 2024-06-21 04:40 GMT

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ పాన్- ఇండియన్ మూవీ ‘మట్కా’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ డా. విజయేందర్ రెడ్డి తీగల, SRT ఎంటర్టైన్మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో మీనాక్షి చౌదరి , నోరా ఫతేహి క‌థానాయుక‌లుగా న‌టిస్తోండ‌గా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి వి ప్రకాష్ కుమార్ సమకూరుస్తున్నారు. అయితే తాజాగా ఈ మట్కా మూవీ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమవ‌గా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ లెన్తీ 40-రోజుల ముఖ్యమైన షెడ్యూల్ కోసం RFCలో మ్యాసీవ్ సెట్‌ నిర్మించి చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఈ షెడ్యూల్‌లో పార్ట్ అయ్యారు.

కాగా ‘మట్కా’ మూవీ దేశం అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకుని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ అవతార్‌లో కనిపించనుండడం విశేషం.


Similar News