అభిమానిని హింసిస్తున్న తండ్రి.. అండగా ఉంటానన్న హీరో

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ‘జగ్ జగ్ జీయో’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన హీరో.. ఈ క్రమంలో ఓ అమ్మాయి చేసిన మెసేజ్‌తో ఆవేదన చెందాడు..Latest Telugu News

Update: 2022-06-08 10:18 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ 'జగ్ జగ్ జీయో' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన హీరో.. ఈ క్రమంలో ఓ అమ్మాయి చేసిన మెసేజ్‌తో ఆవేదన చెందాడు. ఆమె తండ్రి తనతో పాటు తల్లిని ప్రతీ రోజు హింసిస్తున్నాడని, పోలీసులకు కంప్లయింట్ చేస్తే పట్టించుకోవట్లేదని తెలిపింది. ఇక ఎన్ని సాక్షాలు చూపించినా వ్యర్థమైపోతున్నాయని వెల్లడించిన బాధితురాలు.. తన తండ్రి పలు ఇల్లీగల్ కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నాడని చెప్పింది. దీనిపై స్పందించిన వరుణ్.. 'ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది నిజమైతే నేను హెల్ప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అధికారులతో మాట్లాడుతా' అని తెలిపాడు. కాగా అభిమానిపై ఇంత కేరింగ్ చూపిస్తున్న వరుణ్‌ను నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు. 


Similar News