నెట్టింట హీట్ పెంచుతున్న వర్మ హీరోయిన్ బోల్డ్ ఫొటోలు.. కసి బొమ్మలా చేసావంటూ కామెంట్స్
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అందరికీ సుపరిచితమే. ఆయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు.
దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అందరికీ సుపరిచితమే. ఆయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆయన ఏ పోస్ట్ పెట్టినా నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతోంది. అంతేకాకుండా కొన్నిసార్లు వివాదాలకు దారితీస్తాయి. అయితే గతంలో వర్మ చీర కట్టుకుని అందంగా ఉన్న ఓ అమ్మాయి ఫొటో షేర్ చేసి ఆమె వివరాలు తెలిస్తే చెప్పాలని పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో పోస్టులో ఈ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి సతీష్ అని చెప్పారు. అంతేకాకుండా ఆమెతో ‘శారీ’ అనే సినిమా తీస్తున్నట్లు కూడా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. సినిమా కోసం శ్రీలక్ష్మి పేరును ఆరాధ్య దేవిగా మార్చుతున్నట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు ప్రకటించాడు.
ఇదిలా ఉండగా.. తాజాగా, వర్మ తన ట్విట్టర్ వేదికగా శారీ సినిమా కోసం శ్రీలక్ష్మికి ఫొటో షూట్ జరిగినట్లు ప్రకటించాడు. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలను కూడా షేర్ చేశాడు. ‘‘ఇవి కేరళకు చెందిన ఆరాధ్య దేవి అనే అమ్మాయి ఫోటోలు. Rgv డెన్ బృందం ఒక ఇన్‌స్టా రీల్లో కనుగొన్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్న మా సినిమా శారీ కోసం సంతకం చేసింది. ఫోటోగ్రాఫర్ యశ్వంత్ చేసిన ఫోటో షూట్ ఇది’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే శ్రీలక్ష్మి కూడా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫొటోలు వైరల్ అవుతుండటంతో అవి చూసిన నెటిజన్లు పుత్తడి బొమ్మను కసి బొమ్మగా చేశావు. ఈ కేరళ అమ్మాయిని ఇంతలా మార్చేశావేంటి వర్మ అంటూ కామెంట్లు చెస్తున్నారు.