స్టార్ కిడ్ అయిన నన్నే రూమ్ బుక్ చేస్తా వస్తావా అని అడిగాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్.
దిశ, సినిమా: స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాకుండా.. ఇటీవల రిలీజై సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న ‘హనుమాన్’ చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న వరలక్ష్మి.. ప్రస్తుతం ‘శబరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని అనిల్ దర్శకత్వం వహించగా.. మహేంద్రనాథ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీ మే 3వ తేదీన రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ మేరకు మీడియాతో ముచ్చటించిన వరలక్ష్మి తన లైఫ్‌లో జరిగిన పలు ఆసశక్తికర విషయాలను పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ‘స్టార్ హీరో కూతుర్ని అయినంత మాత్రాన నా కెరీర్ సాఫీగా సాగలేదు. నన్ను కూడా చాలా సినిమాల్లోనుంచి తొలగించారు. ఇండస్ట్రీలో ఎదగడం అంత ఈజీ కాదని మా నాన్న నాకు స్టార్టింగ్‌లోనే చెప్పారు. ఒకసారి అయితే.. ఓ చానల్ హెడ్ పనిమీద మా ఇంటికి వచ్చి నాతోనే తప్పుగా మాట్లాడాడు. మీ మూడ్ బాగా లేనట్లు ఉంది.. రూమ్ బుక్ చేస్తా వస్తారా అని అడిగాడు. నాకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు సార్ అని అడిగా. మీ మూడ్ బాగా లేదు కదా ఎంజాయ్ చేయడానికి రూమ్‌కి వెళ్దాం వస్తారా అని అడిగాడు. నాకు కోపం వచ్చి.. నా ఇంటికి వచ్చి నాతోనే ఇలా మాట్లడతావా. అయితే.. స్టార్ హీరో కుమార్తెను అయినా నాతోనే నువ్వు ఇలా అన్నావంటే నార్మల్ పర్సన్‌తో ఎలా ఉంటావో అని సీరియస్ అయ్యి.. అతనిపై కేసు పెట్టాను. దీంతో అతనిని జాబ్ నుంచి తీసేశారు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వరలక్ష్మి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.