ఆ హీరోకు తల్లిగా వరలక్ష్మి.. వద్దంటున్న ఫ్యాన్స్
వారసత్వంగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్, వరుసపెట్టి నెగిటివ్ రోల్లో నటించి, మంచి పేరు సంపాదించుకుంది.
దిశ, సినిమా: వారసత్వంగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్, వరుసపెట్టి నెగిటివ్ రోల్లో నటించి, మంచి పేరు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం తాను ఓ సినిమాలో స్టార్ హీరోకు తల్లిగా నటించడానికి సిద్ధమైందని తెలిసింది. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. అయితే ఈ సినిమాలో ధనుష్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ను తల్లిగా నటించమని డైరెక్టర్ సంప్రదించారట. సినిమా స్టోరీ బాగుండటంతో వెంటనే వరలక్ష్మి కూడా ఈ పాత్రకు ఒప్పుకుందట. కానీ ఆమె అభిమానులు ‘ఇంతకాలం పవర్ ఫుల్ లేడీ విలన్గా చేసి ఇప్పుడు తల్లి పాత్రలు చేయడం బాగోదని అంటున్నారు. ‘నీకు అలాంటి పాత్రలు సెట్ కావు’ అని సూచిస్తున్నారు.