నా బాడీ సైజుల గురించి మా అమ్మను టార్చర్ చేశారు.. ఆమె పట్ల నీచంగా ప్రవర్తించారు

బాడీ షేమింగ్ కామెంట్స్ తనతోపాటు తన ఫ్యామిలీని కూడా మానసికంగా వేధించాయంటోంది నటి వహ్‌బిజ్ దొరాబ్జీ.

Update: 2023-08-15 09:51 GMT

దిశ, సినిమా: బాడీ షేమింగ్ కామెంట్స్ తనతోపాటు తన ఫ్యామిలీని కూడా మానసికంగా వేధించాయంటోంది నటి వహ్‌బిజ్ దొరాబ్జీ. రీసెంట్‌గా ఓ సమావేశంలో కెరీర్ అనుభవాలపై ఓపెన్ అయిన ఆమె తన శరీరంపై చేసిన కామెంట్స్ చూసి తన తల్లి చాలా ఏడ్చిందని చెప్పింది. ‘సున్నిత మనస్తత్వం కలిగివుండే నేను ఎవరి గురించి నెగెటీవ్ కామెంట్స్ చేయను. అయినా నెట్టింట పోస్ట్ చేసిన నా ఫొటోలను టార్గెట్ చేస్తూ బాడీ పార్ట్స్‌పై దారుణంగా ట్రోల్ చేశారు. నిజానికి కెరీర్ ప్రారంభించినప్పుడు సన్నగా ఉండేదాన్ని. తర్వాత అనారోగ్య సమస్యల వల్ల బరువు పెరిగాను. దీంతో చాలా విమర్శలను ఎదుర్కొన్నాను. నిజంగా ఆ దశ చాలా కష్టమైంది. కొన్నిసార్లు నాపై నేనే విశ్వాసం కొల్పోయే దశకు చేరుకున్నా. నెగెటీవ్ కామెంట్స్‌ను కామన్‌గా తీసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అంతేకాదు మా అమ్మను కూడా నాతో పోల్చుతూ నీచంగా ప్రవర్తించారు’ అంటూ ఎమోషనల్ అయింది. చివరగా మనం ఇతరులను గౌరవిస్తే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారనే విషయం గమనించాలని ట్రోలర్స్‌కు చురకలంటించింది.

Full View

Read More:   ఆమె ప్రైవేట్ పార్ట్‌ను జూమ్ చేసి ఫొటో తీసిన రిపోర్టర్.. అక్కడే టార్గెట్ చేస్తున్నారని సింగర్ ఆవేదన

Tags:    

Similar News