అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినీ లవర్స్‌ను ఎంతగా అలరించిందో తెలిసిందే. ఆ తర్వాత పుష్ప2 కోసం కూడా ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Update: 2024-05-29 06:14 GMT

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినీ లవర్స్‌ను ఎంతగా అలరించిందో తెలిసిందే. ఆ తర్వాత పుష్ప2 కోసం కూడా ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజైన ఓ గ్లింప్, ఓ సాంగ్ కూడా బాగా ఆకట్టుకోవడంతో బన్నీ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పుష్ప.. పుష్ప సాంగ్ బాగా వైరల్ కూడా అయింది.

ఇటీవల సెకండ్ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేసిన మేకర్స్ అందులో రష్మిక.. సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడె నా సామి... అంటూ పాడే కపుల్ సాంగ్ గురించి తెలిపారు. దీంతో ఈ పాటకోసం ఇటు బన్నీ ఫ్యాన్స్, అటు రష్మిక ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా.. రీసెంట్‌గా పుష్ప 2 సినిమా నుంచి సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక సినిమా విషయానికి వస్తే ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. పుష్ప వన్‌తో ఇప్పటికే పాన్ ఇండియా హిట్ కొట్టి.. ఊహించని రీతిలో కలెక్షన్స్‌ రాబట్టి, నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్, పుష్ప2తో ఇంకెన్ని రికార్డులు సాధిస్తాడో వేచి చూడాల్సిందే. ఇక రెండో సాంగ్ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.

Full View


Similar News