మర్యాదగా మాట్లాడండి.. రిషబ్ పంత్ అభిమానిపై ఊర్వశి ఫైర్
ఐపీఎల్లో భాగంగా ఇటీవల జరిగిన DC vs SRH మ్యాచ్‌లో రిషబ్ పంత్ అభిమాని తన పేరును వక్రీకరించడంపై ఊర్వశి రౌతేలా సీరియస్ అయింది.
దిశ, సినిమా : ఐపీఎల్లో భాగంగా ఇటీవల జరిగిన DC vs SRH మ్యాచ్‌లో రిషబ్ పంత్ అభిమాని తన పేరును వక్రీకరించడంపై ఊర్వశి రౌతేలా సీరియస్ అయింది. తన ఇంటిపేరును రౌతేలాకు బదులుగా రటోలా అని తప్పుగా ఉచ్చరించడంపై కోపంతో రగిలిపోయింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఆ వీడియోను షేర్ చేస్తూ.. ‘నాకు అది చాలా విలువైనది. నా ఇంటిపేరును అపహస్యం చేయడం ఆపండి. దానికి చాలా అర్థం ఉంది. అది ఎంతో శక్తి, దీవేనలు కలిగివుంది. ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్. ఇట్స్ నాట్ ఏ జోక్’ అంటూ తనదైన స్టైల్లో విరుచుకుపడింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘అలాంటి వారిని పట్టించుకోవద్దు. తెలివిలేని వ్యక్తులే మీ పేరును ఎగతాళి చేస్తున్నారు’ అంటూ మద్ధతుగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
'ఛత్రపతి' హిందీ రీమేక్ సినిమా అన్నీ కోట్లు సాధిస్తేనే హిట్ ఐనట్టు?