స్టార్ క్రికెటర్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి.. షాక్ అవుతోన్న నెటిజన్లు?
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఐటెమ్ సాంగ్ వస్తుందంటే చాలు కుర్రాళ్ల నుంచి ముసలివారు సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. అంత గ్లామర్నెస్తో ఊర్వశీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మరీ. ఇక ఈ భామ తరచూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తూనే ఉంటుంది. ఇకపోతే ఊర్వశీ క్రికెటర్ రిషబ్ తో రిలేషన్లో ఉన్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేశాయి. కాగా తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూకు హాజరై రిషబ్ గురించి ఎదురైన ప్రశ్నకు సంచలన సమాధానం చెప్పింది. అతడితో గొడవ.. వీరి రిలేషన్ గురించి ప్రస్తావిస్తూ.. రిషబ్‌ను మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఏం చేస్తావ్? పెళ్లి చేసుకుంటావా? అని అడగ్గా.. ఎలాంటి సందేహం లేకుండా వెంటనే నో అని ఆన్సర్ ఇచ్చింది. ఊర్వశీ సమాధానం విన్న నెటిజన్లు.. ఈ రేంజ్లో వెంటనే నో అని చెప్పిందంటే రిషబ్ పై ఎంత కోపంగా ఉందో అంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.