ఏం చెప్తున్నావ్.. ఏం చేస్తున్నావ్.. దివాళీ అర్ధనగ్న ప్రదర్శనపై urfi కౌంటర్

ఇంటర్‌నెట్ సంచలనం ఉర్ఫీ జావేద్‌ దీపావళి అర్ధనగ్న ప్రదర్శనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది. దివాళీ సెలబ్రేషన్స్‌లో భాగంగా టాప్‌ లెస్‌గా దర్శనమిచ్చి నెటిజన్లకు షాకిచ్చిన నటి.. Latest Telugu News

Update: 2022-10-29 07:53 GMT
ఏం చెప్తున్నావ్.. ఏం చేస్తున్నావ్.. దివాళీ అర్ధనగ్న ప్రదర్శనపై urfi కౌంటర్
  • whatsapp icon

దిశ, సినిమా : ఇంటర్‌నెట్ సంచలనం ఉర్ఫీ జావేద్‌ దీపావళి అర్ధనగ్న ప్రదర్శనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది. దివాళీ సెలబ్రేషన్స్‌లో భాగంగా టాప్‌ లెస్‌గా దర్శనమిచ్చి నెటిజన్లకు షాకిచ్చిన నటి.. రొమాంటిక్‌గా లడ్డు తింటూ కొంటె చూపులతో మత్తెక్కించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇష్యూపై సెలబ్రిటీలతోపాటు పలువురు నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలోనే నటుడు సుదాన్ష్ పాండే స్పందిస్తూ.. 'నేను ఈ వ్యక్తిని ఫాలో కావడం లేదు. కానీ, వార్తా చానెల్‌ల కారణంగా ప్రతిరోజూ ఇలాంటి భయంకరమైన దృశ్యాలను చూడాల్సి వస్తోంది. ఆ వీడియో చూస్తే చాలా కోపం వచ్చింది. దీపావళి వంటి శుభప్రదమైన పండుగను అపహాస్యం చేయడాన్ని మీరు ఎలా ప్రచారం చేయగలరు. అది కూడా లక్ష్మీ పూజ రోజు' అంటూ ఫైర్ అయ్యాడు. అయితే తాజాగా దీనిపై రియాక్ట్ అయిన ఉర్ఫీ.. 'సుదాన్ష్ పాండే చాలా బాగా చెప్పారు. మీరు కపటత్వం, ద్వంద్వ ప్రమాణాలతో ఉన్నారు. మీరు నటించే అనుపమ సీరియల్‌‌ మహిళా సాధికారత గురించి చెప్తోంది. అందులో స్త్రీలు సమాజ కట్టుబాట్లను బద్దలు కొడుతున్నారు. కాబట్టి ఇలాంటివి మాట్లాడే ముందు మీరు నటిస్తున్న సొంత షోను స్పష్టంగా అర్థం చేసుకోవడం మంచిది' అంటూ కౌంటర్ ఇచ్చింది. 

Tags:    

Similar News