Upendra : ‘యూఐ ది’ రిలీజ్ డేట్ ఫిక్స్.. రూలర్ లుక్‌లో అదరగొట్టిన ఉపేంద్ర

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యూఐ’.

Update: 2024-08-16 14:15 GMT

దిశ, సినిమా: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యూఐ ది’. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో రీష్మా నానయ్య, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ టీజర్‌తో ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను ఫాంటసీ ప్రపంచలోకి తీసుకెళ్ళాడు ఉపేంద్ర. ఇప్పుడే ఇదే జోష్‌లో మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఉపేంద్ర రూలర్ లుక్ కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. కాగా.. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News