మా పిల్లలను కూడా అలాగే పెంచుతాం: ఉపాసన

రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ ఉమన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఉపాసన.

Update: 2023-02-22 11:04 GMT

దిశ, సినిమా: రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ ఉమన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఉపాసన. ఇటీవల తాను తల్లి కాబోతునట్లు ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. అపోలో హెల్త్ మ్యాగజైన్ నిర్వాహకురాలిగా, హెల్త్ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న ఉపాసన.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఆమె ఎలాంటి పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే తాజాగా తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లపై స్పందించింది. 'నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టానని అంటున్నారు. కానీ, నా తల్లిదండ్రులు ఈ స్థాయిలో ఉండడానికి ఎంతో కష్టపడ్డారు. నేను కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతర వృత్తి పరమైన బాధ్యతలతో ఉన్నాను. మా పిల్లలను కూడా అలాగే పెంచుతాం. దయచేసి నా గురించి నెగిటివ్‌గా రాసి నెగెటివిటీ స్ప్రెడ్ చెయ్యొద్దు' అని కోరింది.

Tags:    

Similar News