మెగా ప్రిన్సెస్ పేరు ఖరారు? బారసాల వీడియో రిలీజ్ చేసిన ఉపాసన..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత జూన్ 20న తల్లిదండ్రులయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత జూన్ 20న తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. పాప పుట్టిన రోజు నుంచి ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ నడుస్తూనే ఉంది. ఆ పాపకు అంజలి అనే పేరు పెట్టుబోతున్నట్లు పలు వార్తలు కూడా వచ్చాయి. కానీ, దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు.
తాజాగా, ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో తన డార్లింగ్‌కు పేరు పెట్టబోతున్నట్లు ఓ పోస్ట్ షేర్ చేసింది. నేడు మెగా వారసురాలికి బారసాల కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అయితే మెగా ప్రిన్సెస్ పేరు ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ పేరును పూజా కార్యక్రమంలో మాత్రమే రివీల్ చేయాలని చిరంజీవి సూచించారట. కాగా, మెగా ప్రిన్సెస్ బారసాలకు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
Also Read: రామ్ చరణ్ పాపకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శర్వానంద్.. నువ్వు సూపర్ అంటున్న ఫ్యాన్స్?