Upasana బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతోన్న పిక్స్..!
రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం తరపున కీలక బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా సినిమాలతో బిజీగా ఉంటోన్న భర్తకు అండగా నిలుస్తూ, తనదైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. ఇక ఈ దంపతులిద్దరు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెగా ఇంట ప్రిన్సెస్ రాకతో సంబరాలు అంబరాన్నంటాయి. ఇటీవల తమ పాపకు ‘క్లీంకార’ అని నామకరణం చేశారు. అయితే నిన్న(జులై 20) మెగా కోడలు ఉపాసన పుట్టినరోజుని తన భర్త చరణ్‌తో కలిసి ఇంట్లో సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం తన ఫ్యాన్స్‌తో ఐటీసీలో జరుపుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. మెగా అభిమానులంతా తనకు విషెష్ చెబుతూ పెద్ద ఎత్తున ఫోటోలు వైరల్ చేస్తున్నారు.
Read more : disha newspaper