పద్మవిభూషణ్ అందుకోవడానికి ముందు చిరంజీవిని అలాంటి ప్రశ్న అడిగిన ఉపాసన.. వైరల్ అవుతున్న వీడియో
మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని గురువారం నాడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరుకి పద్మ విభూషణ్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇందులో భార్య సురేఖ, కూతురు సుస్మిత, కోడలు ఉపాసన, కొడుకు రామ్ చరణ్ పాల్గొన్నారు. అయితే అవార్డ్ పురస్కారానికి ముందు ఉపాసన, చిరంజీవి మధ్య జరిగిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అసలు అందులో ఏముందంటే.. చిరంజీవి అవార్డ్ తీసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్‌లో రెడీ అవుతుండగా.. అక్కడే ఫొటోషూట్ జరిగింది. ఆ తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటుండగా.. అక్కడికి ఉపాసన వెళ్లి మామయ్య మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను అంటుంది. అప్పుడే మామయ్య నాలో క్లీన్ కారాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? అని అడగ్గా.. దానికి చిరు తాను నీకు మరో ప్రతిరూపం అని చెప్తాడు.
దీంతో ఉపాసన కాదు మామయ్య మా ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్.. ఇద్దరి తాతయ్యలకు పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి. అని చెప్పి నవ్వింది. దానికి చిరంజీవి కూడా ఆశ్చర్యపోయి నిజమే కదా అని అంటాడు. అలాగే మరో వీడియోలో ఉపాసన అవార్డు తీసుకోబోతున్నారు మీ ఫీలింగ్ ఏంటి మామయ్య అని అడిగింది. దీంతో చిరు ఇంత మంచి కోడలు క్లీన్ కారాను ఇచ్చిన తర్వాతే ఇంత బిగ్గేస్ట్ అవార్డు వచ్చిందని అంటాడు. ప్రస్తుతం చిరంజీవి, ఉపాసన మధ్య జరిగిన సన్నివేశం చూసిన వారంతా సంతోష పడుతున్నారు. అయితే ఉపాసన తాతయ్య ప్రతాప్ చంద్రారెడ్డికి 2010లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది.