ప్రధాని మోదీని కలిసిన ఉన్ని ముకుందన్.. యంగ్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్ తెలుగులో ‘భాగమతి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

Update: 2023-04-25 05:11 GMT

దిశ, వెబ్ డెస్క్: మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్ తెలుగులో ‘భాగమతి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మలయాళంలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా, ఉన్ని ముకుందన్, ప్రదాని మోదీని కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘థాంక్యూ సర్.. 14 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిశాను. చిన్నప్పుడు మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ.. నేను కోలుకోలేదు. మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని కలుస్తా నా.. గుజరాతీలో మీతో ఎప్పుడు మాట్లాడుతానా అని ఎదురుచూస్తూ వచ్చాను. ఇన్నాళ్ళకు నాకల నిజమైయ్యింది. నా సోషల్ మీడియాలో ఇది చాలా ఉత్తేజకరమైన పోస్ట్.. మీ సమయం 45 నిమిషాలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నా జీవితంలో ఈ 45 నిమిషాలు చాలా మెమరబుల్ .. మీరు నాకు చెప్పిన మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి సలహా ఆచరణలో పెడతాను. మీ సలహాలను ఖచ్చితంగా అమలు చేస్తాను’’ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు ఉన్ని ముకుందన్. అంత బిజీ షెడ్యూల్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్ని ముకుందన్ తో 45 నిమిషాలు టైమ్ కేటాయించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఉన్ని ముకుందన్ బీజేపీ‌లో చేరుతున్నారా అని అనుమాన పడుతున్నారు.

Tags:    

Similar News