Samantha :సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మలయాళ హీరో..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యశోద'. నవంబర్ 11న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించాడు.. Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యశోద'. నవంబర్ 11న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించాడు. తాజాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఉన్ని ముకుందన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముకుందన్ మాట్లాడుతూ '' సరోగసి అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కానీ, సరోగసి ఒక భావోద్వేగ ప్రయాణం, అదొక అద్భుతం. మన పురాణాల్లో కూడా ఇలాంటి వాటి గురించి విన్నాం. ఈ సినిమాలలో సరోగసి గురించి, బయట జరిగే కొన్ని అంశాలలను చూపించాం అని ముకుందన్ అన్నాడు. అలాగే సమంత గురించి మాట్లాడుతూ సమంత చాలా అంకితభావంతో కష్టపడి పనిచేసే నటి. ఆమె తన పాత్ర కోసం భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. సమంతతో కలిసి పని చేస్తునప్పుడు మయోసైటీస్‌తో బాధపడుతున్నట్టు తెలియదు. సెట్‌లో ఈ విషయం ఎవరికీ చేప్పలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు.