Sree leela: శ్రీలీల హ్యాండ్ బ్యాగ్‌లో ఊహించని వస్తువు.. అది లేకపోతే అమ్మడు బయటకే రాదట?

‘పెళ్లి సందD’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల.. అనతికాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

Update: 2024-08-10 15:32 GMT

దిశ, సినిమా: ‘పెళ్లి సందD’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల.. అనతికాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మొదటి మూవీనే హిట్ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. బాలకృష్ణ, రవితేజ, మహేశ్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలో కూడా చాన్స్‌లు అందుకుంది ఈ బ్యూటీ. అయితే.. గత కొంతకాలంగా ఈ అమ్మడు చేస్తు్న్న సినిమా వరుస డిజాస్టర్స్ ఎదుర్కొవడంతో.. ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజ్ పడిపోయిందని అంతా అనుకున్నారు. అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చి డాక్టర్ చదువుపై ఫోకస్ పెట్టింది.. మళ్లి సినిమాలకు ఎప్పుడు సైన్ చేస్తుందో అనుకున్నారు.

కానీ మరోసారి రవితేజతో జతకట్టడానికి సిద్ధం అయింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పూజకార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా చేస్తుంది. అటూ చదువు, ఇటు సినిమాలు, యాడ్స్ అంటూ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ బ్యూటీ గురించి ప్రజెంట్ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా హీరోయిన్లు, ఇంకేవరైనా అమ్మాయిలు తమ హ్యాండ్ బ్యాగ్‌లో మొబైల్, ఎయిర్ పాడ్స్, మేకప్ కిట్, ఇతర అత్యవసర వస్తువులు క్యారీ చేస్తారు. కానీ శ్రీలీల వీటితో పాటుగా.. అమ్మవారి కుంకుమ కూడా తన బ్యాగ్‌లో క్యారీ చేస్తుందట. అమ్మవారి భక్తురాలైన శ్రీలీల ఆ కుంకుమ తనతో ఉండటం రక్షణగా భావిస్తుందట. అలాగే మంచి జరుగుతుందని అనుకుంటుందట. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా అమ్మవారి కుంకుమ హ్యాండ్ బ్యాంగ్‌లో ఉండాల్సిందేనట. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. శ్రీలీలకు అమ్మవారిపై ఉన్న నమ్మకం చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News