స్టార్ డైరెక్టర్‌తో అక్రమ సంబంధం పెట్టుకోన్న బుల్లితెర స్టార్ సీరియల్ నటి?

9 ఏళ్ల వయస్సులోనే బుల్లితెర ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మంగమ్మగారి మనవరాలు సీత అలియాస్ జ్యోతి.

Update: 2024-03-25 11:44 GMT

దిశ, సినిమా: 9 ఏళ్ల వయస్సులోనే బుల్లితెర ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మంగమ్మగారి మనవరాలు సీత అలియాస్ జ్యోతి. తల్లి కోరిక మేరకు తమిళ పరిశ్రమలో బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. నటనపై ఇంట్రెస్ట్‌తో ఈమె నటిగానే స్థిరపడింది. ఓ వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు బీఎస్సీ కంప్లీట్ చేసింది. తర్వాత ఈటీవీలో సుమన్ టెలిఫిల్మ్ ద్వారా కథానాయికగా పరిచయమైంది.

అనంతరం జ్యోతి మంగమ్మగారి మనవరాలు, చంద్రముఖి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, భార్య.. ఇలా ఎన్నో ఫేమస్ సీరియల్స్ లో అవకాశం దక్కించుకుని తన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె సీరియల్ జ్యోతికి మరింత ఫేమ్ ను తెచ్చిపెట్టింది. ఇకపోతే ఈ నటి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. జ్యోతి టాలీవుడ్ ఓ బడా దర్శకుడితో ఎఫైర్ నడుపుతున్నట్లు నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు.

ఈమె డైరెక్టర్ తో రిలేషన్ లో ఉండటానికి ఏకంగా ఓ కండిషన్ కూడా పెట్టుకుందట. ప్రస్తుతం సీరియల్స్ లో ఎక్కువగా నటించడం లేదు.. బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెరపై అలరిద్దామనుకుంటుందా ఏంటి? డైరెక్టర్ కు పెట్టిన కండిషన్ ఇదేనా? అందుకే సీరియల్స్ లో నటించడం లేదా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరీ ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Similar News