రణ్‌బీర్‌తో మితిమీరిపోయిన రొమాంటిక్ సీన్స్.. ముందుగా చాలా డిస్టర్బ్ అయ్యా.. ముగ్గురు నలుగురితో..
‘యానిమల్’ సినిమాతో రణ్‌బీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్‌కు ఎంత అప్లాజ్ అందిందో.. క్యారెక్టర్ చిన్నదైనా అంతకు మించిన గుర్తింపు యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీకి వచ్చింది.
దిశ, సినిమా : ‘యానిమల్’ సినిమాతో రణ్‌బీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్‌కు ఎంత అప్లాజ్ అందిందో.. క్యారెక్టర్ చిన్నదైనా అంతకు మించిన గుర్తింపు యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీకి వచ్చింది. కేవలం 15 నిమిషాల పాత్రలో కనిపించిన ఈ గ్లామర్ డాల్ యూత్‌కు కనెక్ట్ అయిపోయింది. అయితే మరోవైపు రణ్‌బీర్‌తో శృంగార సన్నివేశాలు మితిమీరిపోయాయనే విమర్శలు కూడా అందుకుంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన త్రిప్తి.. కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ‘బుల్బుల్’లోని రేప్ సీన్స్ తనను పర్సనల్‌గా సవాల్ ఎదుర్కొనేలా చేశాయని, మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యానని చెప్పింది. ఆ సన్నివేశాలతో పోలిస్తే రణ్‌బీర్‌తో రొమాంటిక్ సీన్స్‌లో అంతగా ఇబ్బంది అనిపించలేదని తెలిపింది. సెట్లో ముగ్గురు నలుగురు మాత్రమే ఉండేవారని దీంతో పెద్దగా పర్సనల్‌గా ఎఫెక్ట్ కాలేదని వివరించింది. ముఖ్యంగా ‘బుల్బుల్’లో సీన్ చేయాలంటే ధైర్యాన్ని కూడగట్టుకోవడం కన్నా ఆ సన్నివేశాలకు లొంగిపోవడం చాలా కష్టమన్న బ్యూటీ.. వాటితో పోలిస్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సన్నివేశానికి తక్కువ కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.