డైరెక్టర్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్.. స్వీయ దర్శకత్వంలో సినిమా..

టాలీవుడ్ హీరోయిన్ ‘ఎస్తర్ నోరొన్హా’ ‘100 అబద్ధాలు’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2023-09-14 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ‘ఎస్తర్ నోరొన్హా’ ‘100 అబద్ధాలు’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పాపులర్ డైరెక్టరైన తేజ ఈ ముద్దుగుమ్మను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ అమ్మడు.. సునీల్ ‘భీమవరం బుల్లోడు, 69 సంస్కార్ కాలనీ’ వంటి చిత్రాల్లో నటించి ఆడియన్స్‌ను అలరించింది. ఇప్పటికే హీరోయిన్‌గా, గాయకురాలిగా అనేక రకాల టాలెంట్ చూపించిన ఎస్తర్ ఆమె డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘ది వేకెంట్ హౌస్’ చిత్రంతో రాబోతుంది. ఈ మూవీకి కథ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సాహిత్యం, సాంగ్స్‌తో పాటు దర్శకత్వం కూడా ఎస్తర్ నోరోన్హానే వహిస్తుంది. ఈ సినిమాను ఈ హీరోయిన్ తల్లి జానెట్ నోరోన్హా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News