నీ హగ్స్, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి నా లైఫ్‌లోకి రా.. స్టార్ హీరోయిన్

‘లక్ష్మీ, స్టైల్, మాస్, రాఖీ’ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది హీరోయిన్ చార్మి.

Update: 2024-01-18 09:34 GMT

దిశ, సినిమా: ‘లక్ష్మీ, స్టైల్, మాస్, రాఖీ’ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది హీరోయిన్ చార్మి. అనూహ్యంగా ఈ బ్యూటీ నటనకు దూరమైంది. ప్రస్తుతం ఈమె ప్రొడ్యూసర్‌గా కొనసాగుతోంది. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. ఈ నిర్మాణ సంస్థలో రోగ్, పైసా వసూల్, జ్యోతిలక్ష్మి, లైగర్, రొమాంటిక్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు తెరకెక్కించింది. ఇస్మార్ట్ శంకర్ మినహా.. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. ఇకపోతే తాజాగా చార్మి తాజాగా ఎమోషనల్ అవుతూ గుండెలు బరువెక్కే కామెంట్స్ చేసింది.

‘‘చార్మికి పెట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. అయితే తన వద్ద మూడు హై బ్రీడ్ పెట్ డాగ్స్ ఉండేవట. రెండేళ్ల క్రితం ఓ డాగ్ దూరమైందట. ఆ కుక్కను తలచుకుంటూ చార్మి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నువ్వు దూరమై రెండు ఏళ్లు అవుతుంది. నీ కౌగిలిని మిస్ అవుతున్నాను. నీ ప్రేమను కోల్పోతున్నాను. నువ్వు ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన మగబిడ్డ గా ఉంటావు. నా జీవితంలో త్వరగా తిరిగి రా. నువ్వు లేకుండా అమ్మ అసంపూర్ణం.’’ అంటూ డాగ్ ఫొటోను షేర్ చేసి.. క్యాప్షన్ రాసుకొచ్చింది.


Similar News