పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు టాలీవుడ్ డైరెక్టర్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?
ఈ ట్రోలింగ్ మీద నేను లీగల్‌గా పోరాడతాను.. కేసులు పెడతాను
దిశ,వెబ్ డెస్క్: సాధారణంగా సినిమా వాళ్లని బాగా ట్రోలింగ్ చేస్తారు. వీరిలో కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు.. మరి కొంత మంది వాళ్ళకి కౌంటర్లు వేస్తుంటారు. ఈ మధ్య కాలంలో కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్ట్ చేసిన వెంకటేష్ మహా మీద సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు. కేజీయఫ్ మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా ఆయన మీద ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.
నేషనల్ మీడియాలో సైతం వెంకట్ మహా మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. కేజీయఫ్ అనేది ఓ సినిమా? రాకీ భాయ్‌ది కూడా ఓ కారెక్టరా? అంటూ ఇలా తనకి ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేసాడు. అయితే, ఎప్పుడూ ఈ ట్రోలింగ్‌ను చూసీ చూడనట్టుగా వదిలేసే వెంకట్ మహా.. ఈ సారి చాలా సీరియస్ అయ్యాడు. వదిలేస్తే మాట వినరు కదా మీరు.. సరే చెప్పున్నా వినండి.. ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు.. ఏం సినిమా తీశామన్నది ముఖ్యం.. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.. నేను తెలుగులో గొప్ప సినిమాలు తీశాను.. ఇంకా తీస్తాను.. ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. ఇక ఊరుకోను. అలాగే ఈ ట్రోలింగ్ మీద నేను లీగల్‌గా పోరాడతాను.. కేసులు పెడతాను అంటూ ఓ నెటిజెన్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశాడు.