బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన టాలీవుడ్ బ్యూటీ..! రొమాంటిక్ మూడ్‌తో మత్తెక్కించే ఫొటోలు..
‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రద్ధాదాస్.
దిశ, వెబ్‌డెస్క్: ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రద్ధాదాస్. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. సినిమాలకు దూరంగా ఉన్న శ్రద్ధా.. టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటుంది. దాంతోపాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ట్రెండీ లుక్స్‌తో కవ్విస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పటి వరకు సింగిల్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేసిన ఈ అమ్మడు సడెన్‌గా మరో యువ నటుడితో దర్శనమిచ్చింది. ఆ నటుడు మరెవరో కాదు.. అభితేష్ ద్వివేది. వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్‌లో మత్తేకించే కళ్లతో చూస్తున్న శ్రద్ధాపై చేయి వేసుకుని భుజంపై తల పెట్టుకుని ఫోజ్ ఇచ్చాడు అభితేష్. రొమాంటిక్ మూడ్‌లో మత్తెక్కించేలా ఉన్న ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీరు ఇద్దరిని లవర్స్‌గా ఫిక్స్ అయిపోయిన నెటిజన్లు ‘ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ’ అని, ‘సూపర్ జోడీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి : ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్