నేడు దివంగత సినీ నటుడు ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు

దివంగత సినీ నటుడు ఉదయ్ కిరణ్ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు.

Update: 2024-06-26 02:03 GMT

దిశ, సినిమా: దివంగత సినీ నటుడు ఉదయ్ కిరణ్ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. 2000లో చిత్రం మూవీతో ఉదయ్ కిరణ్ తెలుగు హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇతను తీసిన సినిమాలలో మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సమయంలో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ సాధించిన యువ హీరో ఉదయ్ కిరణ్ మాత్రమే. అప్పట్లో ఉదయ్ కిరణ్‏కు లేడీ ఫాలోయింగ్ ఓ రేంజ్‏లో ఉండేది. అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు ఉదయ్ కెరీర్‌పై ప్రభావం చూపాయి. ఫలితంగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. కెరీర్ ఒడిదుడుకులతో విసిగిపోయిన ఉదయ్ చివరకు ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. 2014 జనవరి 6న తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 26 ఉదయ్ కిరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ కు సంబంధించిన ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు


Similar News