నేడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి పుట్టినరోజు..

సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-07-04 03:48 GMT

దిశ, సినిమా: సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసకు దర్శకధీరుడైనా రాజమౌళి సోదరుడు కీరవాణి తన పాటలతో సంగీత ప్రియులను అలరించాడు. ఈయన 1987లో తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా తన కెరీన్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత 1989లో ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన మనసు మమత అనే తెలుగు చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు ఎం. ఎం. కీరవాణి. ఈయన తెలుగు భాషతో పాటు వేరే భాషల్లోనూ వర్క్ చేశారు. అలా అన్ని భాషలు కలిపి సుమారు 250కి పైగా సినిమాలకు సంగీతం అందించి ప్రేక్షకులను అలరించాడు కీరవాణి. ఇక బాహుబలి సినిమాతో కీరవాణి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇందులో ఆయన చేసిన నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. ఇలా తన సంగీతంతో అలరించిన సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.



 



Similar News