Shah Rukh Khan : నేడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు

నేడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు నవంబర్ 2, 1965. ల్లీలో పుట్టిన షారుఖ్ మొదటి నుంచి కూడా సినిమాల మీద ఆసక్తి ఉండటంతో ముంబైకి వచ్చేసాడు.

Update: 2023-11-02 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు నవంబర్ 2, 1965. ల్లీలో పుట్టిన షారుఖ్ మొదటి నుంచి కూడా సినిమాల మీద ఆసక్తి ఉండటంతో ముంబైకి వచ్చేసాడు. మొదటిసారి 1992లో ‘దీవానా’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 1993 లో వచ్చిన బాజీగర్, డర్ సినిమాల్లో విలన్ గా కనిపించి అదరగొట్టాడు. దీంతో అన్నీ విలన్ రోల్స్ వచ్చేసరికి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హీరోగా, హీరోగా చిన్న సినిమాలు చేస్తూ వచ్చాడు. 1995లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్, కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. దీంతో షారుఖ్ వరుస చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల జవాన్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం డుంకి సినిమాతో ఈ డిసెంబర్ 21న రానున్నాడు షారుఖ్. అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News