భార్య గురించి సంచలన విషయాలు బయటపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో వల్ల చాలా బాధపడ్డామని తాజాగా హీరో వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో వల్ల చాలా బాధపడ్డామని తాజాగా హీరో వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్-3లో వరుణ్ సందేశ్.. ఈ హీరో భార్య వితిక పాల్లొన్న సంగతి తెలిసిందే. అయితే వరుణ్.. ‘‘వితిక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చాలా మంది మాపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. వితిక ఆ కామెంట్స్ చూసి చాలా బాధ పడింది. నన్ను ఇలా చూపించరేంటి..? ఇలా ఎడిట్ చేసి చూపించారేంటి అని బాధపడింది. ఎంతో మంది తనపై ట్రోల్స్ చేశారు. నాకు ఆ మెసేజులు చూపించింది. అవి చూశాక నాకే బాధనిపించింది. దారుణంగా కామెంట్స్ చేశారు. అలాంటి మెసేజులు పెట్టిన వాళ్లని ఏమనాలో, ఏం చేయాలో అర్ధంకాలేదు. చాలా రోజులు వితికా దానినుంచి బయటకు రాలేకపోయింది. నా వైఫ్ సూపర్ ఉమెన్ కాబట్టి వాటిని తట్టుకుంది’’ అంటూ వరుణ్ సందేశ్ వెల్లడించారు.