‘బేబీ’ సినిమా నటికి బెదిరింపులు.. చెప్పరాని బూతులు తిడుతూ

తాజాగా విడుదలైన ‘బేబీ’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పక్కర్లేదు.

Update: 2023-07-24 12:45 GMT

దిశ,సినిమా: తాజాగా విడుదలైన ‘బేబీ’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.65 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇంకా షేర్‌ను రాబడుతోంది. ఇకపోతే ఈ మూవీలో హీరోయిన్ వైష్ణవి చెడ్డ దారిలో నడవడానికి పూర్తి కారణం ఫ్రెండ్‌‌గా నటించిన సీత అనే క్యారెక్టర్. అయితే తాజాగా సీత గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిర్రాక్ సీత మాట్లాడుతూ.. ‘మూవీ చూశాక నా గురించి నీచంగా, దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. చెప్పడానికి కూడా రాని భాషలో బూతులు తిడుతున్నారు. చాలామంది బెదిరిస్తున్నారు. ఇంకొంతమంది నా ఇంటి అడ్రస్ కోసం వెతుకుతున్నట్లు కూడా తెలిసింది. కానీ ‘బేబీ’ సినిమాలో నేను పోషించిన పాత్రకు నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు ఎలాంటి సంబంధం లేదు. నన్ను సినిమాలో చూసి తప్పుగా అర్థం చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు’ అంటూ ఆవేదన చెందింది సీత.

Read More : ఆ డైలాగ్ రాసినందుకు సారీ చెబుతున్న బేబీ డైరెక్టర్

Vaishnavi Chaitanya : ఏ మాత్రం తప్పటడుగులేసిన ‘బేబి’ పని అవుట్.. .. 

Full View

Tags:    

Similar News