నా సైజులు చూసి స్టార్ నటిగా ఎదగలేవన్నారు.. బాడీ షేమింగ్‌పై హ్యూమా

మహిళల బాడీ షేమింగ్ ఇష్యూపై హ్యూమా ఖురేషి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు కెరీర్ కొత్తలో తన శరీరం గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటే నిజంగానే తనలో ఏదో భయంకరమైన లోపం ఉందని ఆందోళనకు

Update: 2023-07-28 07:29 GMT

దిశ, సినిమా : మహిళల బాడీ షేమింగ్ ఇష్యూపై హ్యూమా ఖురేషి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు కెరీర్ కొత్తలో తన శరీరం గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటే నిజంగానే తనలో ఏదో భయంకరమైన లోపం ఉందని ఆందోళనకు గురైనట్లు చెప్పింది. అంతేకాదు అనేకసార్లు ఈవెంట్స్, ప్రజల సముహాల్లోకి వెళ్లాలంటే సిగ్గుపడ్డట్లు తెలిపింది. ‘జనాల మాటలు నమ్మి నా బాడీ షేప్స్ సరిగా లేవని అనుకున్నాను. ఒక సినిమా సమీక్షకుడు ఒకసారి నాతో ఇలా చెప్పాడు. ‘మెయిన్ స్ట్రీమ్ కథానాయికగా ఉండటానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే నీవు ఐదు కిలోల అధిక బరువు కలిగివున్నావు’ అన్నాడు. దీంతో చాలారోజులు ఒత్తిడి లోనయ్యాను. కొంతమంది నా శరీరాన్ని అవహేళన కూడా చేశారు’ అని గుర్తు చేసుకుంది. అయితే తనకు తెలిసింత వరకూ ప్రజలు సినిమాలను సమీక్షించడం లేదని, కేవలం నటీనటులపై దూషణలు మాత్రమే చేస్తున్నారంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Tags:    

Similar News