విజయ్ దేవరకొండతో నటించాలనే కోరిక ఉన్నవారు.. వెంటనే వీరిని కాంటాక్ట్ చేయండి!
విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే
దిశ, సినిమా: విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల, రౌడీ హీరో పుట్టినరోజున ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు.ఆ రోజున పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. పాన్-ఇండియా లెవెల్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపికకు కాస్టింగ్ కాల్ ని నిర్మాతలు ప్రకటించారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. కాస్టింగ్ కాల్ పోస్టర్ కూడా పెట్టారు. యాక్టింగ్ వస్తే చాలు, తెలుగొస్తే సంతోషం, గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు.. అంటూ కొత్తగా రాసుకొచ్చారు. ఈ మేరకు మీ ప్రొఫైల్‌లను svc59casting@gmail.com కు పంపాలని వారు తెలిపారు.. లేదా మీ ప్రొఫైల్‌ని 91 9676843362కు పంపండి.
మరి మీకు నటనపై ఆసక్తి ఉండి, గోదావరి స్లాంగ్‌పై పట్టు ఉంటే ఈ సినిమాలో నటించే అవకాశం దక్కుతుంది. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాన్-ఇండియా మూవీ చేస్తున్నాడు.
Acting osthe chaaalu…😊
— Sri Venkateswara Creations (@SVC_official) June 19, 2024
తెలుగొస్తే సంతోషం… 🤗
గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు 🫡
Put yourself on the Big Screen &
The Bigger World of #SVC59 ✊
Share your profiles on svc59casting@gmail.com
(or)🗨️ WhatsApp on +91 9676843362@TheDeverakonda @storytellerkola@SVC_official pic.twitter.com/4yNBePoGvH