ఈ బుల్లితెర స్టార్ నటి.. ఏపీ మాజీ సీఎం మనవరాలు అట..!

తొమ్మిదవ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లకు పైగా నటిగా రాణిస్తోన్న జ్యోతి రెడ్డి ఎన్నో సీరియల్స్‌లో ప్రతినాయకురాలి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Update: 2023-04-02 10:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిదవ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లకు పైగా నటిగా రాణిస్తోన్న జ్యోతి రెడ్డి ఎన్నో సీరియల్స్‌లో ప్రతినాయకురాలి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో హాజరై.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ నేను చిన్నప్పటి నుంచే చదువులో ముందుడేదాన్ని, డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్ వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించాను. నా కుటుంబాన్ని చాలా ఇష్టపడతాను. అందుకని అమ్మా నాన్న, భర్త, పిల్లల గుర్తుగా చేతిపై పచ్చబొట్లు కూడా వేయించుకున్నానని.’’ చెప్పారు.

అలాగే తాను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలినని చెప్పి నెటిజన్లకు షాక్ ఇచ్చింది. తనకు ఉద్యోగం చేయాలని ఉండేదని.. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తమ ప్రాజెక్టులలో నటించమని వారి పీఏలను ఇంటికి పంపించేవారని.. అది చూసి తన తల్లి అంత గొప్పవాళ్లు నటించమని అడిగితే వద్దంటావేంటని బ్రెయిన్ వాష్ చేసి ఆమెని ఒప్పించిందని తెలిపారు. జ్యోతి తల్లి వల్లే యాక్టింగ్ ఫీల్ట్‌లోకి అడుగుపెట్టి, ఇప్పటికీ కొనసాగుతున్నానని తెలిపారు. అలాగే షూటింగ్‌లో ఉన్నంతవరకూ అందరూ మంచి స్నేహితులే, కానీ ఇంటికి వెళ్లిపోయాక ఎవరితోనూ అంతగా టచ్‌లో ఉండనని చెప్పారు. తను మూడేళ్ల వయసులో ఇంటి గడప మీద పడుకున్న సమయంలో తన తల్లి బిందెడు నీళ్లు ఆమెపై గుమ్మరిస్తే.. అప్పటి నుంచి సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకున్నట్లు తెలిపారు. తన భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని, ఆమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని వెల్లడించారు.

Also Read..

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ మళ్లీ ప్రెగ్నెంట్ అయిందా? 

Tags:    

Similar News