సర్జరీ చేయించుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. చెండాలంగా ఉన్నావంటూ కామెంట్స్

రోజుల్లో సర్జరీ అనేది చాలా కామెన్ అయిపోయింది.

Update: 2024-07-01 11:11 GMT

దిశ, సినిమా: రోజుల్లో సర్జరీ అనేది చాలా కామెన్ అయిపోయింది. హీరో, హీరోయిన్లు, బుల్లితెర ఆర్టిస్టులు ఇలా అందరూ కూడా ముఖానికి సర్జరీ చేయించుకుంటున్నారు. అయితే.. ఇలా చేయించుకున్న తర్వాత కొంత మందికి సర్జరీ సెట్ అవుతుంటే.. మరికొందరు మాత్రం ఇంతకు ముందు ఉన్న అందాన్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా బుల్లితెర బ్యూటీకి ఇదే పరిస్థితి ఎదురైంది.

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీసత్య ఒకరు. తర్వాత బిగ్‌బాస్ షో తో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ పెంచుకున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ పలు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే.. శ్రీసత్య ఇటీవల తన పై పెదవికి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఆఫ్టర్ సర్జరీ వీడియోస్, ఇంతకు ముందు చేసిన వీడియోస్‌తో పోల్చుతూ.. ‘నీకు సర్జరీ అస్సలు సెట్ కాలేదు. అనవసరంగా లిప్ సర్జరీ చేయించుకుని ఉన్న అందాన్ని పోగొట్టుకున్నావు.. ఇప్పుడు చండాలంగా ఉన్నావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.  

Tags:    

Similar News