'Miss Shetty Mr Polishetty' సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కలిసి జంటగా నటించిన సినిమా ''మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి''.

Update: 2023-07-30 10:05 GMT
Miss Shetty Mr Polishetty సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కలిసి జంటగా నటించిన సినిమా ''మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి''. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఈమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా చాలా రోజుల నుంచి వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ అనుకోకుండా వాయిదా పడడంతో ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఆగస్టు 4న రిలీజ్ చేస్తామని చెప్పగా.. ఇప్పుడు రిలీజ్ చేయడం లేదంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందున ఆగస్టు 4న వాయిదా వేస్తున్నాం కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. ఇక కొత్త రిలీజ్ డేట్ పై తాజాగా ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆగస్టు 18న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. రారా కృష్ణయ్య సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  

Also Read: తక్కువ రేటుకు అమ్ముడుపోయిన Bhola Shankar

Tags:    

Similar News