పొన్నియిన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ ఇదే!

1955 నాటి నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా 2019లో మొదలు పెట్టగా, దాదాపు మూడేళ్లకు పైగా కష్టపడ్డతర్వాత నేడు అన్ని భాషల్లో విడుదలైంది.

Update: 2022-09-30 02:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : 1955 నాటి నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా 2019లో మొదలు పెట్టగా, దాదాపు మూడేళ్లకు పైగా కష్టపడ్డతర్వాత నేడు అన్ని భాషల్లో విడుదలైంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ ప్రాధాన పాత్ర పోషించారు. చోళుల మహారాజు ఆదిత్య కరికాలుడిగా విక్రమ్, కార్తీక్, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రభు, జయం రవి, శోభిత దూళిపాల్ల వంటి ఎంతో మంది నటులు ఇందులో నటించారు.

అయితే ఈ సినిమాపై రోజు రోజకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. కాగా, అసలు సినిమా ఎలా ఉంది, నటీనటుల తమ నటనతో ప్రేక్షకులను మెప్పించ గలిగారో లేదో ఇప్పుడు, ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

మణిరత్నం నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమానైతే కోరుకుంటున్నారో.. అలానే ఉందంట. నవల కు రూపం ఇచ్చి, తన అభిమానులను మత్ర ముగ్ధులను చేసిన సినిమా అంటే అది పొన్నియిన్ సెల్వన్ సినిమానే అంటూ పొగిడేస్తున్నారు. ఇక ఇందులో కరకాలకుడిగా విక్రమ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడంట. అలాగే కార్తీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు, కామెడీ, డ్రామా అన్ని ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడంట. ఇక ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత దూలిపాళ్ల అందంతోనే కాదు తమ నటతనతో అందరినీ తమ వైపుకు లాక్కున్నారంట. అలాగా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సూపర్ ఉంది, మంచి డైలాగ్స్‌తో సినిమా ఎంతో అద్భుతంగా ఉందంటున్నారు. ఎంత సేపు చూసినా చూడాలనిపించే సినిమా అంటూ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

Also Read:  గూస్‌బంప్స్.. 'ఆదిపురుష్' ఫస్ట్‌లుక్ విడుదల 


Similar News