SIIMA 2023 winners : సౌత్ నుంచి ‘సైమా -2023 ' అవార్డుల విజేతలు వీరే..
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)2023 వేడుక దుబాయిలో అట్టహాసంగా జరిగింది.
దిశ, సినిమా: సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)2023 వేడుక దుబాయిలో అట్టహాసంగా జరిగింది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. ఇందులో భాగంగా 2023 సంవత్సరానికిగానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ‘RRR’లో ఆయన నటనకుగానూ అవార్డు వరించింది. అలాగే ‘ధమాకా’లో నటనకు శ్రీ లీల ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా ‘సీతారామం’ ఎంపికయ్యాయి. మృణాల్ ఠాకూర్ కు ఉత్తమ పరిచయ నటి అవార్డు దక్కింది. 'భీమ్లా నాయక్’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడుగా దగ్గుబాటి రానా అవార్డు అందుకున్నాడు.
- ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
- ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్)
- ఉత్తమ హాస్య నటుడు : శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయన్)
- ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు) : కరత్, అనురాగ్ (మేజర్)
- ఉత్తమ సంగీత దర్శకుడు : ఎం. ఎం. కీరవాణి (ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ గీత రచయిత : చంద్రబోస్ (నాటు నాటు)
- ఉత్తమ నేపథ్య గాయకుడు : రామ్ మిర్యాల (డీజే టిల్లు)
- ఉత్తమ పరిచయ దర్శకుడు : మల్లిడి వశిష్ట (బింబిసార)
- సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ (కార్తికేయన్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) : మృణాల్ ఠాకూర్ (సీతారామం)