టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఒక్కరీమేక్ చేయని దిగ్గజ దర్శకులు వీళ్లే!
విభిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు.
దిశ, సినిమా: విభిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు. వీరు ఆడియన్స్ ను ఎంటర్‌టైన్ చేయడం కోసం, సమాజంలో జరిగేవి జనాలకు తెలియజేయడం కోసం దర్శకులు ఏడాది, రెండేళ్లు కష్టపడి జనాలను రియలైజ్ చేస్తున్నారు. ఎంత కష్టపడినా కొన్నిసార్లు సినిమా విజయం సాధించవచ్చు.. కొన్నిసార్లు విఫలం ఎదుర్కోవచ్చు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో రీమేక్ సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రీమేక్ మూవీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఈ చిత్రాలతో మంచి సక్సెస్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు. తమిళ చిత్రం అసురన్ తెలుగులో రీమేక్‌గా వచ్చింది. అలాగే నారప్ప కూడా తెలుగులో మంచి సక్సెస్‌ను అందుకుంది. మాలీవుడ్ సినిమా దృశ్యం ఓటీటీలోకి వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవల రిమేక్ సినిమాలు ట్రెండ్‌గా మారిపోవడంతో తమిల్ సినిమా తడమ్ మూవీని తెలుగులో రెడ్ సినిమాగా తెరకెక్కించారు.
అలాగే హీరో నితిన్ మాస్ట్రో చిత్రం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అందాదున్’ రీమేక్ కావడం గమనార్హం. ఇలా మరెన్నో సినిమాలు రిమేక్ సినిమాలుగా తెరకెక్కించి డైరెక్టర్లు ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న అగ్ర దర్శకుల్లో కొందరు డైరెక్లర్లు మాత్రమే రీమేక్ మూవీస్ చేయకుండా స్ట్రెయిట్ చిత్రాలు తీస్తున్నారు. వారిలో సుకుమార్, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
వీరు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా రీమేక్ చేయలేదు. ఇక మన జన్కన్నకైతే.. రీమేక్ అన్న పదం అస్సలు నచ్చదట. ఈ దర్శకుడి మూవీస్ వేరే వాళ్లు రీమేక్ చేసి విజయం సాధించాలి తప్ప.. ఈయన మాత్రం వేరొకరి మూవీస్ రీమేక్ చేయరట. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ కూడా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కొరటాల శివ తెరకెక్కించే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.