అసలే ఎండకాలం.. వేడి నుంచి తట్టుకోవాలా, ఈ డ్రింక్స్ తాగాల్సిందే

ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా మంది ఎండ వేడిని తట్టుకోలేక అలసటకు లోనవుతుంటారు

Update: 2023-03-24 08:05 GMT

 దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా మంది ఎండ వేడిని తట్టుకోలేక అలసటకు లోనవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. వేసవిలో ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన, బెస్ట్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక కొబ్బరి బోడం తాగడం వలన మన శరీరంలో వేడి తగ్గి, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చేస్తుంది. అదువలన వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

  • మ్యాంగో లస్సీ కూడా ఈ టెంపరేచర్ ని తట్టుకోవడానికి బాగుంటుంది. మీరు దీనిలో తేనే వేసుకుని తాగండి. ఆరోగ్యానికి కూడా మంచిది.

  • మజ్టిగ అనేది మన శరీరం చల్లగా ఉండేలా చేస్తుంది. అందువలన వేసవిలో బట్టర్ మిల్క్ తాగడం వలన వేడి నుంచి బయటపడవచ్చును.

Tags:    

Similar News