‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ రావడం వెనుక ఆ విషయమే కారణమా..?

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరీలో ఆస్కార్ సాధించింది.

Update: 2023-03-14 04:45 GMT

దిశ, వెబ్ డెస్క్: దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరీలో ఆస్కార్ సాధించింది. మొట్టమొదటిసారి ఉత్తమ గీతం విభాగంలో దేశం నుంచి ఆస్కార్ అవార్డు అందుకున్న ఘనతను నాటు నాటు పాట దక్కించుకుంది. అలాగే ది ఎలెఫెంట్ విస్పరర్స్ మూవీ కూడా షార్ట్ ఫిలిం కేటాగిరీలో ఆస్కార్ అవార్డు అందుకుంది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ రెండు సినిమాల గురించే మాట్లాడుతున్నారు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం వెనుక ఓ ముఖ్యమైన కారణం ఉందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అదేంటంటే ఫారిన్ ఫ్లేవర్ (విదేశీ వాసన). ఈ మూవీలో ఇండియన్ ఫ్లేవర్ తో పాటు బ్రిటిష్ వాసన కూడా ఫుల్లుగా ఉంటుంది.

ఇప్పుడు ఈ విషయమే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ తెచ్చిపెట్టింది అనే ఓ ఆసక్తికర చర్చ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇండియాకు ఆస్కార్ తీసుకురావడంలో విదేశీ సెంటిమెంట్ పని చేసిందని వారు వాదిస్తున్నారు. అయితే అందుకు వారు చెబుతున్న కారణం ఏంటంటే.. తాజాగా ఆస్కార్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ మొదలుకొని గాంధీ మూవీ వరకు అన్ని సినిమాల్లో ఈ ఫారిన్ ఫ్లేవరే కనబడుతుంది. సినిమా ఇతివృత్తం, యాక్టర్స్, ప్రాతినిధ్యం, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా ఏదో ఒక విషయంలో ఫారిన్ మూలాలు పుష్కలంగా ఉన్నాయి. ఎలాగో ఒకసారి చూద్దాం..


గాంధీ మూవీ..

జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా 1982లో గాంధీ మూవీ రిలీజ్ అయ్యింది. గాంధీ మూవీని ఇంటర్నేషనల్ ఫిలిం ఇన్వెస్టర్స్, నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండో బ్రిటిష్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకల్లో ఈ సినిమా మొత్తం 8 అవార్డులను కొల్లగొట్టింది. అయితే ఈ మూవీలో స్టోరీ మొత్తం గాంధీజీ, ఆనాటి స్వాంతంత్ర్యోద్యమం చుట్టూ తిరిగినా.. మెజారిటీ యాక్టర్స్, టెక్నీషియన్స్ అంతా కూడా ఫారిన్ వాళ్లే. ఆస్కార్ అవార్డు అందుకున్నవాళ్లంతా కూడా  విదేశీయులే. లేదంటే విదేశీ మూలాలు ఉన్న భారతీయులు.


స్లమ్ డాగ్ మిలీనియర్..

ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న మరో సినిమా స్లమ్ డాగ్ మిలీనియర్. బ్రిటిష్ డైరెక్టర్ డేనీ బోయెల్ డైరెక్షన్ లో 2009లో వచ్చిన ఈ మూవీ అదే ఏడాది నిర్వహించిన 81వ అకాడమీ అవార్డుల్లో 3 అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో రసూల్ పూకుట్టీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ విభాగంలో (జయహో సాంగ్) గుల్జార్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఏఆర్ రెహమాన్ కు ఆస్కార్ అవార్డులు వరించాయి. అయితే అవార్డు అందుకున్నవాళ్లంతా భారతీయులే అయినప్పటికీ.. సినిమా అంతా ఇండియా చుట్టే తిరిగినప్పటికీ.. ఈ మూవీ మాత్రం బ్రిటిష్ నుంచి ఆస్కార్ బరిలోకి దిగింది. ఈ రకంగా ఈ సినిమాకూ విదేశీ మూలాలు ఉన్నాయి.


ఆర్ఆర్ఆర్..

ఇక ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న మరో మరో సినిమా ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ మూవీని భారతదేశ స్వాతంత్రోద్యమ ఇతివృత్తంగా రూపొందించారు. సీతారామ రాజు రోల్ పోషించిన రామ్ చరణ్ ఓ బ్రిటిష్ పోలీస్ గా ఉంటూనే దేశ స్వాతంత్ర్యం కోసం తెర వెనుక నుంచి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వెపన్స్ ను కొల్లగొట్టేందుకు పోలీస్ ఆఫీసర్ గా జాయిన్ అవుతాడు. ఇక భీమ్ గా నటించిన జూనియర్ ఎన్టీఆర్.. సీతారామరాజుకు స్వరాజ్య పోరాటంలో అండగా నిలబడతాడు. ఈ మూవీలో ఆనాటి సామాజిక పరిస్థితులు, బ్రిటిష్ వాళ్ల క్రూరత్వాన్ని దర్శకుడు రాజమౌళి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ మూవీ ఆద్యంతం ఇండియన్ ఫ్లేవర్ తో పాటు బ్రిటిష్ వాసన కూడా ఫుల్లుగా ఉంటుంది.


ది ఎలిఫెంట్ విస్పరర్స్

ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే ఈ షార్ట్ ఫిలింను కార్తికి గోన్సాల్వేస్ డైరెక్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఓ దంపతులకు ఓ ఏనుగుతో ఏర్పడిన అనుబంధాన్ని (రియల్ స్టోరీ) ఇతివృత్తంగా తీసుకొని ఈ మూవీని రూపొందించారు. 2022 డిసెంబర్ 8న నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన డగ్లస్ బ్లష్ అమెరికాకు చెందిన ప్రముఖ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసిన స్టీవ్ ఫాల్కనర్ కూడా అమెరికాకు చెందినవారే. ఇలా చూస్తే ఈ మూవీలో కూడా ఫారిన్ ఫ్లేవర్ ఉన్నట్లే.

మొత్తానికి భారత్ కు ఆస్కార్ తెచ్చిపెట్టిన ఫిలింస్ లల్లో ఏదో రూపంలో ఫారిన్ ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు ఇదే భారత్ కు ఆస్కార్ రావడానికి సెంటిమెంట్ గా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏదీ ఏమైనప్పటికీ ఈ విదేశీ సెంటిమెంట్ మాత్రం బాగానే వర్కవుట్ అయ్యింది.


Tags:    

Similar News