వీడియో కాల్ కట్ చేయడం మర్చిపోయి స్నానం చేసిన మహిళ.. బంధువులందరూ చూస్తుండగానే?
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, పని చేయడానికి వీడియో కాల్స్ పైనే ఆధారపడ్డారు.
దిశ, ఫీచర్స్: కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, పని చేయడానికి వీడియో కాల్స్ పైనే ఆధారపడ్డారు. వీడియో కాల్స్ ద్వారా ఎన్నో లాభాలున్నప్పటికీ అదే స్థాయిలో కొంతమందికి నష్టాలు కూడా జరిగాయి. ముఖ్యంగా చాలా మంది కెమెరాను ఆఫ్ చేయడం మర్చిపోయి ఇబ్బందికర అనుభవాలను ఎదుర్కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ మహిళ కాల్ కట్ చేయడం మర్చిపోయి.. అందరి చూస్తుండగానే స్నానం చేసింది.
వివరాల్లోకెళ్తే.. యూకేకు చెందిన ఓ మహిళ రిలేషన్స్ లండన్ లో ఉండగా.. రీసెంట్ గా తమ బంధువు ఒకరు కాన్సర్ తో మరణించాడు. కాగా లండన్ లోని బార్నెట్ లోని చర్చి వద్ద అతడి అంత్యక్రియలను చూడటానికి ఈ మహిళ వీడియో కాల్ చేసింది. మాట్లాడటం కంప్లీట్ అయ్యాక.. ఆమె వీడియో కాల్ కట్ చేయడం మర్చిపోయింది. దీంతో ఆ మహిళ స్నానం చేసేది తమ బంధువులు చూశారన్న ఆలోచనతో తను మానసికంగా చాలా సఫర్ అవుతోంది. కాగా టెక్నాలజీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయని పలువురు సోషల్ మీడియాలోని నెటిజన్లు సూచిస్తున్నారు.
వీడియో కాల్ లో బట్టలు లేకుండా కనిపించడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు.. మూడేళ్ల క్రితం కెనడియన్ మాజీ పార్లమెంటు సభ్యుడు విలియం అమోస్ అతని సహచరులతో నగ్నంగా కనిపించాడు. జాగింగ్ కు వెళ్లొచ్చిన అతడి కెమెరా అనుకోకుండా ఆన్ కావడంతో.. బట్టలు మార్చుకుంటోన్న సమయంలో ఆ పొరపాటు జరిగింది. దీంతో విలియం ఆ మిస్టేక్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని వాగ్దానం కూడా చేశాడంటూ జనాలు మరోసారి ఆ సంఘటనను గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.