‘ది వ్యాక్సిన్ వార్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసినా.. కానీ..!
బాలీవుడ్ స్టార్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎలాంటి చిత్రాలు తీసిన కూడా సంచలన విజయం దక్కించుకోవడంతో పాటుగా కొంత వివాదాలు కూడా సృష్టిస్తాయి
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎలాంటి చిత్రాలు తీసిన కూడా సంచలన విజయం దక్కించుకోవడంతో పాటుగా కొంత వివాదాలు కూడా సృష్టిస్తాయి. కాగా ఈ ఏడాది ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాతో వచ్చాడు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీ నేపథ్యంలో వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించాడు. సెప్టెంబర్ 28న విడుదలైనా ఈ మూవీకి పాజిటివ రెస్పాన్స్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు. ఐయామ్ బుద్ధ పతాకంపై పల్లవి జోషినే నిర్మించిన ఈ సినిమాలో ‘కాంతారా’ హీరోయిన్ సప్తమి గౌడ సైంటిస్ట్ గా నటించి మెప్పించగా.. నానా పటేకర్, పల్లవి జోషి, రైమాసేన్, అనుపమ్ ఖేర్, నివేదిత భట్టాచార్య, మోహన్ కపూర్, అంచల్ ద్వివేది, అరవింద్ పాశ్వాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
కాగా తాజాగా ఈ సినిమా నేటి నుంచి ప్రముఖ OTT సంస్థ డిస్నీ+ హాట్‍స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ భాషల్లో స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందన్న విషయంపై డిస్నీ+ హాట్ స్టార్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతమైతే హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.