తమిళలో సూపర్ హిట్ అయిన మూవీ.. ఓటీటీలోకి వచ్చేసింది
ఈ మధ్య కాలంలో సినిమా ట్రెండ్ మొత్తం మారిపోయింది
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సినిమా ట్రెండ్ మొత్తం మారిపోయింది. కొత్త కంటెంట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లు ఎప్పటికప్పుడు OTTలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో పెద్ద హిట్ అయిన సినిమాలు కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సూపర్ హిట్ సినిమాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు తమిళంలో సూపర్‌హిట్ అయిన చిత్రం OTTలోకి రాబోతోంది.
కోలీవుడ్ హీరో కెవిన్ నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. మే 10న విడుదలైన ఈ చిత్రం మంచి అంచనాలను అందుకుంది. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా హీరో కావాలని కలలు కనే ఓ యువకుడి కథే ఈ చిత్రం.
థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీలో నెల రోజుల్లోనే విడుదలైంది. అధికారిక ప్రకటన లేకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు నేరుగా OTTలో విడుదలైంది. ఈ చిత్రంలో కెవిన్‌తో పాటు ప్రీతి ముకుందన్, అదితి పొన్నాకర్, లాల్ ముఖ్య పాత్రల్లో నటించారు.