భార్య ముందే బాలయ్యతో అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్ .. వసుంధర ఏం చేసిందో తెలిస్తే షాక్
నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందించి జై బాలయ్య అనిపించుకున్నాడు.
దిశ, సినిమా: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందించి జై బాలయ్య అనిపించుకున్నాడు. 60 ఏళ్ల వయసులో ఎంతో మంది హీరోలు మూవీస్ చేస్తున్నా బాలయ్య మాత్రం స్పెషల్. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పడే వసుంధరను పెళ్లి చేసుకున్నాడు. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు(బ్రాహ్మణి, తేజస్విని), ఒక కుమారుడు(మోక్షజ్ఞ తేజ) ఉన్నారు. ఇక మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఇప్పుడు బాలయ్య కు సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అదేటంటే..పెళ్లయిన కొత్తలో వసుంధరని తీసుకొని సినిమా షూటింగ్ స్పాట్‌కు బాలకృష్ట వెళ్లాడట అప్పుడు ఆ మూవీ షూట్‌లో ఉన్న హీరోయిన్ రమ్యకృష్ణ వసుంధర ముందే బాలయ్యను హగ్ చేసుకుని మరి ఐ లవ్ యు సార్ ..ఐ లవ్ యు సార్ అంటూ చెప్పుకొచ్చిందట. అయితే ఇది చాలా ఫన్నీగా బాలయ్యను ఏడిపించడానికి జరిగిన సీన్ కావడంతో వసుంధర కూడా చాలా సిల్లీగా తీసుకుంది. ఆమె ప్లేస్‌లో వేరే ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా కోప్పడేవారు కానీ వసుంధర మొదటి నుంచి చాలా మంచి మనస్తత్వం కలది. అందుకే బాలయ్యని అర్థం చేసుకొని బాలయ్య జీవిత భాగస్వామిగా కొనసాగుతుంది.
కాగా ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బోయపాటి దర్శకత్వంలో మరొక సినిమాకు కమిట్ అయ్యాడు.