ఒక్క పాటతోనే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సింగర్..
కరోనా వచ్చినప్పటి నుంచి ఓటీటీల హవా కొనసాగుతోంది. కొత్త సినిమాల నుంచి..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వచ్చినప్పటి నుంచి ఓటీటీల హవా కొనసాగుతోంది. కొత్త సినిమాల నుంచి.. సరికొత్త పోగ్రామ్స్ చేయడం వరకు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతున్నాయి. వీటిలో ఆహా ఫ్లాట్ ఫామ్ ఒకటి. ఇందులో వచ్చిన అన్‌స్టాపబుల్ షో ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే తరహాలో పాపులారిటీ దక్కించుకున్న మరో షో ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’. ఆహా ఫ్లాట్ ఫామ్‌పై టెలికాస్ట్ అవుతున్న ఈ షోకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ ప్రోగ్రాంకి స్పెషల్ గెస్ట్‌గా హాజరైన మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఉగాది స్పెషల్ ఛాలెంజ్‌లో సత్తా చాటుకున్న ఓ సింగర్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. వైజాగ్‌కు చెందిన కంటెస్టెంట్ సౌజన్య ‘అంజనీ పుత్రుడా.. వీరాధి వీరుడా’’ అనే పాట పాడి అందరిని మైమరపించింది. దీంతో అక్కడ ఉన్న జడ్జిలు సైతం ఆమె వాయిస్‌కు మెస్మరైజ్ అయిపోయారు. తను పాడిన పాటకు ఫిదా అయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి.. ఆయన ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా కంపోజ్ చేసి పెట్టిన సాంగ్ పాడేందుకు ఆమెకు ఆఫర్ ఇచ్చారు. దీంతో ఒక్క పాటకే డైరెక్టర్ కోటి ఆఫర్ దక్కించుకుంది అంటూ సింగర్ సౌజన్యపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.